KTR Bus Yatraకు ముహూర్తం ఫిక్స్
మేడిగడ్డ నుంచి KTR బస్సుయాత్ర.. రైతుల సమస్యలే అజెండా!
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) త్వరలో రాష్ట్రంలో Bus Yatra చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(BRS MLA Gangula Kamalakar) వెల్లడించారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ Tour గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా సాగనుంది. ఈ యాత్రలో భాగంగా ప్రాజెక్టుల Ground Realityని కేటీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత పరిస్థితి, నిర్వహణ, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకోనున్నారు. సాగునీటి సమస్యలను ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకెళ్లడమే ఈ Bus Yatra ప్రధాన ఉద్దేశమని గంగుల తెలిపారు.
దీక్షా దివస్‌కు భారీ Public Meeting
మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన దీక్షా దివస్‌ను పురస్కరించుకుని నవంబర్ 29న భారీ Public Meeting నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. 2009లో కేసీఆర్‌ను అరెస్టు చేసిన అలుగునూరు లేదా నుస్తులాపూర్ ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ సభకు దాదాపు 50 వేల మందిని సమీకరించాలని పార్టీ Targetగా పెట్టుకుంది. బస్సుయాత్రతో సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, దీక్షా దివస్ సభ ద్వారా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేయాలని బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది.