4 September, 2026 | 10:27 PM

Breaking News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •   420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్   •   అంజన్న భక్తులకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్   •   సరస్వతీ శిశు మందిర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు   •  

కనకదుర్గమ్మకు కన్నుల పండుగగా లక్ష పుష్పార్చన

04-09-2026 | 08:13pm

4వ శ్రావణ శుక్రవారం

సందర్బంగా ప్రత్యేక పూజలు

చిట్యాల,(విజయక్రాంతి): శ్రావణమాసం(Sravana Masam)  నాలుగో శుక్రవారం సందర్భంగా పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం(Sri Kanaka Durga Temple)లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛైర్మన్‌ మారగోని ఆంజనేయులు గౌడ్‌ పర్యవేక్షణలో డైరెక్టర్లు కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ముఖ్య అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మతో కలిసి అర్చక బృందం భక్తిశ్రద్ధలతో లక్ష పుష్పార్చన(Laksha Pushparchana) చేపట్టారు. చిట్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెరటుపల్లి హనుమంతు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. 

కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుష్పార్చన కార్యక్రమ దాత కందిమల్ల శిశుపాల్‌రెడ్డి రేణుక దంపతులతో పాటు ఆలయ డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, వరకాంతం నరసింహారెడ్డి, రుద్రారపు లింగయ్య, జిట్ట సాయిలు, బెలిదే సత్యనారాయణ, ఏళ్ల మాధవి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో నిండిపోయింది. మహిళా భక్తులు విచ్చేసి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.