ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా జంగిలి నాగరాజు
మునుగోడు,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా(Nalgonda District) ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా మునుగోడు మండలం గుండ్లోరిగూడెం గ్రామానికి చెందిన జంగిలి నాగరాజు నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఐఏఎస్(Collector Badugu Chandrasekhar IAS) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి నియమాక పత్రాన్ని అందజేశారు.
తన నియామకానికి సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy)కి, రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కమిటీ సభ్యుడిగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ ఎమ్మెల్యేకు మంచి పేరు తీసుకొస్తానని తెలిపారు.