అకాల మరణాలు తొలగిపోవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు

04-11-2026 | 12:22pm

మంచినీటితో జలాభిషేకం..

గుమ్మడికాయ, కొబ్బరికాయలతో మొక్కులు

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణంలో వరుసగా చోటుచేసుకుంటున్న అకాల మరణాలు తొలగిపోయి, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం(Impact of El Niño) తొలగిపోయి, కరువు కాటకాలు తగ్గి సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా మంచినీటి బిందెలతో బొడ్రాయికి జలాభిషేకం చేశారు. అనంతరం మామిడి తోరణాలు కట్టి, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల పట్టణంలో వరుసగా అకాల మరణాలు సంభవిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి అరిష్టాలు, ఆపదలు ఎదురుకాకుండా ఉండాలని, విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఈ పూజా కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీందర్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మేండే సైదులు, బీఆర్‌ఎస్‌ నాయకులు బొబ్బల శివశంకర్ రెడ్డి, జిట్ట పద్మ బొందయ్య, ఆగు అశోక్ యాదవ్, దయ్యాల శ్రీకాంత్, రుద్రవరం యాదయ్య, మారగోని రమేష్, సాయి రెడ్డి ప్రతాపరెడ్డి, పాల కృష్ణ, కోనూరు శంకర్, సుర్కంటి నర్సిరెడ్డి, జిట్ట శేఖర్, బోల్గోరి సైదులు, ఆవుల ఆనంద్, ఉప్పలపల్లి నగేష్, రాగుల శివ, చింతపల్లి ప్రవీణ్, గూడ అఖిల్, పల్లె రాజేందర్ గౌడ్, నల్ల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు