మాజీ మున్సిపల్ చైర్మన్ పై ఫిర్యాదు
03-10-2026 | 07:35pm
కల్వకుర్తి: కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం(Former Municipal Chairman Edma Satyam)పై పట్టణ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు(Arya Vysya Mahasabha members) శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్యవైశ్యులను ఉద్దేశించి దూషణలకు పాల్పడటంతో పాటు, తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా దుర్భాషలాడారని ఆరోపించారు.
ఈ మేరకు సత్యంపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ సభ్యులు కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో నిరసన చేపట్టి, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.