కొండెక్కిన ‘కోడి గుడ్డు’!

20-10-2026 | 05:25am
  1. పౌల్ట్రీ రంగంపై ఎల్‌నినో 
  2. పెరుగుతున్న దాణా, మందుల ధరలు
  3.    8 నుండి 10కి చేరే అవకాశం 
  4. విద్యార్థుల పోషకాహారంపైనా ప్రభావం

నాగర్ కర్నూల్ అక్టోబర్ 19 (విజయక్రాంతి): సామాన్యుడి నిత్యావసరాల్లో ఒకటైన కోడి గుడ్డు ధరలు(Chicken egg prices) అమాంతం పెరుగుతొందని అందరిలో ఆందోళన వ్యక్తమవు తోంది. పౌల్ట్రీ రంగంపై(Poultry Sector) దాణా, రవాణా, నిర్వహణ ఖర్చుల భారం భారీగా పెరుగుతుండటంతో గుడ్డు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక గుడ్డు హోల్సేల్ ధర 5:40 పైసలు కాగా రిటైల్ ధర రూ 6 పలుకుతోంది.

ధరాభారం పెరగడం కారణంగా మరికొద్ది రోజుల్లో ఒక్కో గుడ్డు ధర రూ.8 నుంచి రూ.10కు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో సామాన్య కుటుంబాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), సంక్షేమ హాస్టళ్లపై(Welfare hostels) కూడా అదనపు భారం పడే ప్రమాదం లేకపోలేదు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ పరిణామం పౌల్ట్రీ వ్యాపారులు, వినియోగదారులు(Poultry traders, consumers), విద్యార్థుల పోషకాహారంపై(Nutrition for Students) ఎలాంటి ప్రభావం చూపనుందన్నది చర్చనీయాంశంగా మారింది.

దాణా ధరల సెగ.. సరఫరాపై సందిగ్ధం

అమెరికా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొంతమేర పౌల్ట్రీ నిర్వహణలో రవాణా ఖర్చులు పెరిగగా తాజాగా ఎల్నీనో ప్రభావం మరింత ధరలు పెరిగితే గుడ్డు ఉత్పత్తి వ్యయంపై ప్రభావం పడుతుంది. దీంతో చిన్న, మధ్యతరహా పౌల్ట్రీ రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి. కోళ్ల ఎదుగుదలకు వినియోగించే దాణ సొయా క్వింటల్ రూ 4,600 నుండి ప్రస్తుతం అమాంతం పెరిగి ఏడు వేలకు చేరింది. మక్కలు 2,600 నుండి 3100. నూక పర్రం 1,600 నుండి 2,800లకు డిఓపి (థౌడు నుండి వచ్చేది) క్వింటల్ 1,600 నుండి 2,700లకు చేరింది.

వేరుషనగ నుండి విడుదలయ్యే డిఓసి3వేల నుండి 5,800లకు ఎగబాకింది. డిడిజిఎస్1,900నుండి 4,600లకు చేరిందని పౌల్ట్రీ రంగం రైతులు పేర్కొంటున్నారు. వీటితోపాటు కోడి ఎదుగుదలకు వ్యాధి నిరోధక టీకాలు మందులు కూడా అమాంతం పెరిగాయని చెప్తున్నారు. ఎంసిబి కిలో 65 నుండి 130కి, లైసిన్ కిలో 110 నుండి 170కి మి థాయిలన్ కిలో 280 నుండి 550 చేరిందని రైతులు వాపోతున్నారు. ఒక్కో కోడి నిత్యం 110 గ్రాముల దాన సేకరిస్తుందని చెప్తున్నారు.

ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద వారంలో మూడుసార్లు విద్యార్థులకు గుడ్లు అందించడంపైనా ధరల ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తెలంగాణలో మార్కెట్ ధరలు పెరిగి, ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు చెల్లించే మొత్తం సరి పోకపోవడంతో పాఠశాలల్లో గుడ్ల సరఫరాపై ఇబ్బందులు తప్పెలా లేవని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలతోపాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు లక్ష 30 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.

వీరందరికీ ప్రతి వారంలో మూడు చొప్పున గుడ్లు సరఫరా చేస్తున్నారు.జిల్లాలోనూ గుడ్ల సరఫరా కాంట్రాక్టర్లు, పౌల్ట్రీ నిర్వాహకులు, పాఠశాలల మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ధరల పెరుగుదల కారణంగా విద్యార్థులకు అందించే గుడ్ల సంఖ్య తగ్గకుండా, నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు