పందుల కొట్టాలో బీసీ విద్యార్థుల చదువులు

04-10-2026 | 02:33pm

కొల్లాపూర్ అక్టోబర్ 4: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం కేంద్రంలోని ఆదివారం బీసీ హాస్టల్ ను బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాలు మేరకు కొల్లాపూర్ బీసీ హాస్టల్ ను సందర్శించి బీసీ హాస్టల్లోనే వీడియో సమావేశం నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటినుంచి బీసీలను బ్రస్టు పట్టించిందని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల బీసీ హాస్టల్ ఉంటే వాటి పరిస్థితి చూస్తే  పందుల కొట్టాల కంటే దారుణంగా రేకుల రూముల్లో చదువుకుంటూ బీసీ బాలురు.

బాలికలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. రాష్ట్రంలో బీసీలకు 100 గురుకులాలు ఇవ్వాలని గురుకుల పాఠశాలలో పిల్లలు  సీట్లు లేక రోడ్లమీద తిరుగుతున్నారని. కార్పొరేట్ విద్యాసంస్థలలో లక్షల ఫీజులు ఉన్నాయని పేద వర్గాల పిల్లలు ఎట్లా చదువుకుంటారని వారు ఆరోపించారు.

కొల్లాపూర్ బీసీ హాస్టల్ మంజూరు చేయాలని అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు ఒకటి ఎస్సీ. ఎస్టీలకు ఒకటి కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ప్యాకెట్ మనీ సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకే వారికి మిస్ చార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రాష్ట్ర ప్రైవేటు లెక్చలర్ల అధ్యక్షుడు మొగిలి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు