పోలీస్ అమరవీరుల వారోత్సవాలు

23-10-2026 | 09:17am

వాజేడు, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండలంలోని స్థానిక వాజేడు పోలీస్ స్టేషన్(Wajedu Police Station) ఎస్సై జక్కుల సతీష్  ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక స్టేషన్ నుండి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రేఖ అశోక్ ఆధ్వర్యంలో పేరూరు గ్రామంలోని వీధుల్లో అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్లను సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు