గడ్డపోతారంలో విషాదం

23-10-2026 | 09:29am

గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి

జిన్నారం/పటాన్ చెరు అక్టోబర్ 23: సంగారెడ్డి జిల్లా(Sangareddy Gas Leak Incident) జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో శుక్రవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలోని గ్లాబా బ్లాక్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. మృతులను సుదర్శన్, బాలాజీగా గుర్తించినట్లు తెలిసింది. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న జిన్నారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు