రామప్పను సందర్శించిన గ్రూప్ అధికారులు
వెంకటాపూర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ సంపద(World Heritage Site) రామప్ప దేవాలయాన్ని(Ramappa Temple) ఆదివారం హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి(Dr. Marri Chenna Reddy Human Resource Development) సంస్థలో శిక్షణ పొందుతున్న గ్రూప్ 1, 2 అధికారులు భారత్ దర్శన్‌లో(Bharat Darshan) భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ అధికారులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ రామప్ప ఆలయ చరిత్ర, కాకతీయుల శిల్పకళా వైభవం, ఆలయ నిర్మాణ విశిష్టతలను అధికారులకు వివరించారు. అనంతరం అధికారులు రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఈవో ఇమ్మడి భాస్కర్, ఎంసిహెచ్‌ఆర్‌డీ అధికారులు శ్రీనివాస్, టూరిస్ట్ పోలీసులు బద్రు, శ్రీనివాస్, అరుణ్, శ్రీకాంత్‌తో పాటు రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, పర్యాటక శాఖల సిబ్బంది పాల్గొన్నారు.