దినసరి వేతనాల సవరణపై పరిశీలన

05-11-2026 | 06:53pm

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, నవంబర్ 5 (విజయక్రాంతి): దినసరి వేతన ఉద్యోగుల సంక్షేమం(Welfare of daily wage employees), ప్రస్తుత జీవనవ్యయాలకు అనుగుణంగా న్యాయమైన వేతనాలను నిర్ణయించే అంశంపై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న దినసరి వేతన ఉద్యోగుల వేతనాల సవరణ, పెంపుదలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా షెడ్యూల్ ఆఫ్ రేట్స్ 2026–27లో పేర్కొన్న రేట్ల ప్రాతిపదికన దినసరి వేతనాలను సవరించడం, పెంపుదల చేయడంపై కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. ఉద్యోగుల సంక్షేమం, పెరుగుతున్న జీవనవ్యయాలను పరిగణనలోకి తీసుకొని వేతన సవరణ ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో సహాయ కార్మిక అధికారి వి. వినోద,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, డీసీవో రామ్మోహన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి రవీందర్, వివిధ ఇంజనీరింగ్ శాఖల డీఈఈలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు