బాణసంచా విక్రయాలకు లైసెన్స్ తప్పనిసరి

05-11-2026 | 06:58pm

ఎస్సై చల్లా రాజు

వెంకటాపూర్, నవంబర్ 05 (విజయక్రాంతి): దీపావళి పండుగ(Festival of Diwali) నేపథ్యంలో బాణసంచా విక్రయించే(selling fireworks) దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని ఎస్సై చల్లా రాజు(SI Challa Raju) సూచించారు. గురువారం మండల కేంద్రంలోని తాళ్లపాడు సెంటర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని,

చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందిన తర్వాతే బాణసంచా విక్రయాలు చేపట్టాలని, ప్రతి దుకాణంలో అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లు, నీటి సదుపాయం అందుబాటులో ఉంచుకోవాలని, దుకాణాల వద్ద సిగరెట్లు తాగడం, బహిరంగంగా మంటలు వెలిగించడం నిషేధమని, విద్యుత్ వైరింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

నిర్దేశిత పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయరాదని, పిల్లలకు విక్రయించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, దుకాణాల వద్ద రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు.

మరిన్ని వార్తలు