హనుమకొండ జేఎన్ఎస్ లో ఖో ఖో పోటీలు

05-11-2026 | 06:11pm

తెలంగాణ రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి

హనుమకొండ, నవంబర్ 05(విజయ క్రాంతి): క్రీడలవల్ల క్రమశిక్షణ,ఐకమత్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తెలంగాణ రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్(Telangana State Kho Kho Association) అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హనుమకొండ జేఎన్ఎస్ లో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ – 2026 కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యామ్ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న పోలీస్ క్రీడాకారులను, క్రీడా అధికారులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా క్రమశిక్షణ,ఐకమత్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలని, తద్వారా క్రమశిక్షణ,ఐక్యమత్యం,ఆత్మవిశ్వాసం  పెరుగుతుందన్నారు. పోలీస్ సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని మరింత పెంపొందించేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

మరిన్ని వార్తలు