స్వచ్ఛమైన తాగునీటితో ఆరోగ్య పరిరక్షణ
వెంకటాపూర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): వెంకటాపూర్ గ్రామస్థులకు రూ.5 కే స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఐజల్ వాటర్ సంస్థను(Aizawl Water Company) గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ అభినందించారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐజల్ వాటర్ ప్లాంట్‌ను సర్పంచ్ సుగుణ ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ.. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోతే ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, తక్కువ ధరకే శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న ఐజల్ వాటర్‌ను గ్రామస్థులు వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామానికి అవసరమైన సౌకర్యాల కల్పనకు తనవంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, రామప్ప ఆలయ చైర్మన్ ఐలయ్య, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు కోటి, గ్రామ కమిటీ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, వార్డు సభ్యులు కోటి, సునీల్, తిరుపతి, మొగిలి, ఐజల్ వాటర్ ప్లాంట్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ రాజేశ్వర్‌రావు, ఆపరేటర్ రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు రమేష్, సురేష్, భిక్షపతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.