రాజమౌళి ఒక్క మాటతో హైప్!

28-09-2026 | 01:43pm

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, తమిళ స్టార్ హీరో సూర్య(SS Rajamouli-Suriya Movie) కాంబినేషన్‌లో సినిమా రావాలని ఇరు హీరోల అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌పై రాజమౌళి చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో(Social Media), సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇటీవల మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి రాజమౌళి, సూర్య కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు ఉంటుందంటూ మీడియా ప్రశ్నించింది.

ఇవి కూడా చదవండి: పూరీ జగన్నాథ్ బర్త్‌డే స్పెషల్.. (వీడియో)

దీనిపై రాజమౌళి ఆసక్తికరంగా స్పందించారు. సూర్యతో సినిమా గురించి తాను మాట్లాడేందుకు సిద్ధంగానే ఉన్నానని, కానీ ఆ విషయాన్ని ప్రస్తావించడానికి ఇది సరైన వేదిక కాదని ఆయన చెప్పుకొచ్చారు. తాము వచ్చిన సినిమా గురించి కాకుండా తన-సూర్య కాంబినేషన్(Rajamouli Suriya Combo) గురించే హెడ్‌లైన్స్ వస్తే, అసలు సినిమా ప్రమోషన్ పక్కకు వెళ్లిపోతుందని వివరించారు. అయితే అదే సమయంలో సూర్య అభిమానుల్లో ఉత్సాహం పెంచేలా రాజమౌళి మరో మాట చెప్పారు. తామిద్దరం కలిసి ఎప్పుడైనా సినిమా చేస్తే అది తప్పకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఈ కాంబినేషన్‌పై అప్పటికే ఉన్న అంచనాలకు మరింత హైప్ వచ్చింది.

సూర్యను కూడా రాజమౌళి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటీవల ఆయన నటించిన ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’(Vishwanath & Sons) చిత్రాల విజయాలను ప్రస్తావిస్తూ వరుసగా మంచి ఫలితాలు అందుకోవడం డబుల్ ధమాకా అంటూ అభినందించారు. అలాగే జితూ మాధవన్ దర్శకత్వంలో సూర్య చేస్తున్న ‘సీన్’ సినిమాకు సంబంధించిన ప్రచార కంటెంట్ కూడా ఆకట్టుకుంటోందని ప్రశంసించారు. మరోవైపు, రాజమౌళి(Rajamouli Next Movie) దర్శకత్వంలో నటించే అవకాశం గతంలో ఒకసారి చేజారిపోయిందని, ఆయనతో కలిసి పనిచేయాలనే కోరిక తనకు ఉందని సూర్య గతంలో పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజమౌళి-సూర్య సినిమా అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈ కాంబినేషన్‌పై అభిమానుల ఆసక్తిని మరోసారి పెంచాయి. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆసక్తికరంగానే ఉండనుంది.

మరిన్ని వార్తలు