బొగ్గుల గుట్ట పాత నమ్మకాల్ని తగలబెట్టడమే భోగి!

25-11-2026 | 05:25am

చార్మింగ్ స్టార్ శర్వా(Charming Star Sharwa) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. నవంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను డైరెక్టర్ సంపత్ నంది(Sampath Nandi) విలేకరులతో పంచుకున్నారు. 

* నేను -‘భోగి(Bhogi)’ కథ రాయడానికి నా బాల్యంలోని జ్ఞాపకాలే కారణం. మా ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో రామగిరి గుట్ట అని ఒక చోటు ఉండేది. అక్కడ ఒక వ్యక్తి గురించి చాలా విషయాలు చెప్పేవారు. ఆ గుట్ట దగ్గర మూఢ శక్తుల(irrational forces) కోసం ఓ వ్యక్తి ఏదో చేస్తున్నాడని అనేవారు. ఆ వ్యక్తి వస్తే మేమంతా చిన్న పిల్లలం పరిగెత్తేవాళ్లం. ఆ వ్యక్తి ఎందుకు వచ్చేవాడు? మేమంతా ఎందుకు పరిగెత్తేవాళ్లం? అనేది ఇప్పుడే చెప్పను. ఆ సంఘటన నా మనసులో నిలిచిపోయింది. 

* నేను స్వతహాగా తెలంగాణ వాసిని. చిన్నప్పటి నుంచి నాకు ఆ భాష, యాస మీద పట్టు ఉంది. సాహిత్యం మీద కూడా పట్టు ఉంది. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా డైలాగ్స్ అన్నీ రాశాను. 

* ఇదే తరహాలో మహారాష్ట్ర సరిహద్దులో కూడా ఒక సంఘటన జరిగిందని ఒకరు పేపర్ కటింగ్ తీసుకొచ్చారు. అలా ‘బొగ్గుల గుట్ట’ అనే ఫిక్షనల్ విలేజ్‌ను, అక్కడ ఒక ఇన్సిడెంట్‌ను సృష్టించాం. పాత కాలంలో జరిగిన కథ కాబట్టి అప్పటి పరిస్థి తులు, సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు, ప్రేమలు.. అన్నీ చూపిస్తూ ఒక పీరియాడిక్ సినిమాలా రూపొందించాం. 

* ఇది అన్నాచెల్లెళ్ల భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రంలోని బొగ్గుల గుట్టవాసులు నమ్మిన కొన్ని విషయాలు వాస్తవం కాదని నిరూపించడమే కథానాయకుడి లక్ష్యం. నా గత సినిమాలకు భిన్నమైన మీటర్‌లో ఉండే సినిమా ఇది. నా వైపు నుంచి చాలా కొత్త సినిమా. ఇలాంటి సినిమా ఇప్పటివరకు శర్వానంద్ గానీ, నేను గానీ చేయలేదు. ఆయన ఈ సినిమాను చూసి నన్ను గట్టిగా హత్తుకొని అభినందించడం, ఒక ఫిల్మ్ మేకర్‌గా నాకు చాలా ఆనందాన్నిచ్చింది. 

మరిన్ని వార్తలు