ఓటీటీలోకి 'ఇరుముడి'
13-09-2026 | 12:23pm
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్(Box Office) వద్ద ఘన విజయం సాధించింది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.225 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు, అలాగే మరోసారి ఈ ఎమోషనల్ జర్నీని కుటుంబంతో కలిసి చూడాలనుకునే వారి కోసం ఈ డిజిటల్ రిలీజ్ మంచి అవకాశం కల్పిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.