రాయిలాపూర్ మున్సిపల్ పట్టణంలో ఉచిత వైద్య శిబిరం

13-09-2026 | 02:47pm

ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ పార్టీ నాయకులు

మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 13(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధి(Medchal Circle limits)లోని మేడ్చల్ 297  డివిజన్ పరిధిలో గల రాయిలాపూర్ పట్టణంలో "స్ట్రీట్ కాజ్" స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఉచిత వైద్య శిబిరానికి ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉచితంగా న్యాయమైన వైద్యాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో "స్ట్రీట్ కాజ్"సంస్థ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు.

సమాజంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం యువత స్వచ్ఛంధ సంస్థలు ముందడుగు వేయడం శుభపరిణామని రాఘవేందర్ గౌడ్ స్పష్టం చేశారు.అదేవిధంగా తన ఆర్ఆర్ ఫౌండేషన్ తరుపున కూడా ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన వెల్లడించారు.భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఆరోగ్య,విద్యా కార్యక్రమాలకు పూర్తి మద్దతు అందిస్తామని ఆర్ రాఘవేందర్ గౌడ్ తెలియజేశారు.రాయిలాపూర్ మున్సిపల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు స్థానిక ప్రజలకు బిపి,షుగర్,కంటి పరీక్షలతో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పట్టణ ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరణ రెడ్డి.బండి శ్రీనివాస్ గౌడ్.వినయ్.వెల్లూరి ప్రమోద్ కుమార్.స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు