వైకుంఠ రథం వితరణ

13-09-2026 | 02:18pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామపంచాయతీకి(Kambalapalli Gram Panchayat) ఆ గ్రామ పాఠశాల పూర్వపు హెడ్మాస్టర్ కీర్తిశేషులు శ్రీరామ్ వెంకన్న సరోజిని దంపతుల కుమారులు శ్రీరాం చంద్ర శేఖర్, కమలాకర్, విజయకుమార్, ప్రభుత్వ  ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తుల సహకారంతో గ్రామానికి వైకుంఠ రథము సమకూర్చారు. 1,50,000 రూపాయలతో తయారుచేసిన వైకుంఠ రథాన్ని ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీరిక వసంత ఉపేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ కమటం యాకన్న, దాతలు ప్రభుత్వ ఊద్యోగులు రామసహాయం శ్రీధర్ రెడ్డి, కొలిశెట్టి సత్యనారాయణ శ్రీరాం విజయకుమార్, గ్రామ పెద్దలు బెల్లం కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు