కొలువుదీరేందుకు వెళుతున్న గణనాథులు
13-09-2026 | 02:39pm
మహబూబాబాద్ (విజయక్రాంతి): వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రతిష్టించడానికి నిర్వాహకులు గణనాథులను తీసుకెళ్తున్నారు. సోమవారం వినాయక చవితి(Vinayaka Chavithi) సందర్భంగా వాడవాడలా వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. మట్టి విగ్రహాలతో పాటు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రూపొందించిన వివిధ ఆకృతుల్లో తయారుచేసిన గణనాథులను నిర్వాహకులు మండపాలకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ చూసినా వినాయక చవితి వేడుకల కోలాహలం కనిపిస్తోంది.