నూతన మార్కెట్ ను సద్వినియోగం చేసుకోవాలి

13-09-2026 | 02:28pm

మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్

జనగామ,సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): జనగామ పురపాలక(Jangaon Municipality) పరిధిలోని సంజయ్ నగర్ లో నూతనంగా నిర్మించిన మార్కెట్ ను ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ (Municipal Chairperson) కడకంచి బాలమణి శ్రీనివాస్,కమిషనర్ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా సందర్శించారు. మార్కెట్ లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులను పరిశీలించి, మార్కెట్ ను పరిశుభ్రంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.వ్యాపారులు రోడ్లపై కాకుండా నూతన మార్కెట్ లోనే వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా నూతన మార్కెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు