యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే మేలు
26-10-2026 | 01:10pm
బెజ్జంకి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): యాసంగి పంటల సాగులో నీటి లభ్యతను (Water Availability) దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి సంతోష్ రైతులకు సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, భూగర్భ జలాలు తగ్గే అవకాశం (El Niño Effect) ఉందని తెలిపారు.
ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, విద్యుత్ సరఫరా పరిస్థితులను (Power Supply) పరిగణనలోకి తీసుకొని అధిక నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న పంటల సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి వినియోగాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ పంటలను (Alternative Crops) ఎంచుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు