విద్యార్థుల కెరీర్‌కు గీతం బూస్ట్
పటాన్చెరు, అక్టోబర్ 26 (విజయక్రాంతి): గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, కెరీర్ పురోగతికి (Career Development) ప్రత్యేక చర్యలు చేపట్టింది. గీతం వృత్తి సలహా కేంద్రం (జీసీజీసీ) ఆధ్వర్యంలో శిక్షణ, సామర్థ్య అభివృద్ధి, వృత్తి మార్గదర్శకత్వం (Career Counselling), ప్రత్యామ్నాయ కెరీర్ సేవలు అనే మూడు విభాగాలను బలోపేతం చేసింది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, కృత్రిమ మేధ ఆధారిత అభ్యాసం (AI-Based Learning), నిపుణుల మార్గదర్శకత్వంతో పాటు విదేశీ విద్య, పోటీ పరీక్షలు, ప్రభుత్వ, రక్షణ రంగ ఉద్యోగాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం అందించనుంది.
మూడు ప్రాంగణాల్లో ప్రత్యేక సంప్రదింపు వ్యక్తులను నియమించి, ప్రతి విద్యార్థికి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వృత్తిపరమైన సహకారం (Personalized Career Support) అందించనున్నట్లు టీఎంసీజీ డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ తెలిపారు.