పాత ప్రేమకథ.. కొత్త అనుభూతి.. డేట్ ఫిక్స్!

01-10-2026 | 11:52am

టాలీవుడ్‌లో ప్రేమకథలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిన సినిమాల్లో ‘గీతాంజలి’ ది(Geethanjali re release) ప్రత్యేక స్థానం. కింగ్ నాగార్జున, గిరిజ జంటగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్లాసిక్ మూవీ మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. నవంబర్ 13న ‘గీతాంజలి’ రీ-రిలీజ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈసారి సినిమాను మెరుగైన 4K(Nagarjuna Geethanjali, Geethanjali 4K re release) ప్రెజెంటేషన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి: బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్! వైరల్ వీడియో

1989లో(Geethanjali 1989) విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే తన ప్రత్యేకమైన ప్రేమకథ, మణిరత్నం టేకింగ్, నాగార్జున-గిరిజ కెమిస్ట్రీ(Nagarjuna-Girija chemistry), ఇళయరాజా సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాధారణ ప్రేమకథకు భిన్నంగా భావోద్వేగాలను తెరపై కవితాత్మకంగా చూపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే రీ-రిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపిస్తున్న నేపథ్యంలో ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలోకి రావడం నాగార్జున అభిమానులకు వింటేజ్ ట్రీట్‌గా మారనుంది. ముఖ్యంగా పెద్ద తెరపై ఇళయరాజా సంగీతం(Ilaiyaraaja's music), మణిరత్నం విజువల్స్‌ను కొత్త తరం ప్రేక్షకులు 4Kలో ఆస్వాదించే అవకాశం ఉంది. నవంబర్ 13న థియేటర్లలోకి రాబోతున్న ‘గీతాంజలి’.. వింటేజ్ నాగార్జున ఫ్యాన్స్‌ను, క్లాసిక్ సినిమా ప్రేమికులను ఎంతవరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు