రక్తదానంతో 14 ఏళ్ల సేవా ప్రయాణం!
బెజ్జంకి, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని 14 ఏళ్లుగా భాస్కరాచారి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమాలను కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అధికారులు అభినందించారు. బెజ్జంకి మండలం చీలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శానగొండ భాస్కరాచారి వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది డిసెంబర్ 30న చీలాపూర్ గ్రామంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ, సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు అందజేస్తున్నారు. గత 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం ద్వారా ఎంతోమందికి రక్తం అందుబాటులోకి వస్తోందని అధికారులు అభినందించారు.
ఈ సందర్భంగా గురువారం కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో భాస్కరాచారి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులను ఆస్పత్రి సూపరింటెండెంట్ సన్మానించి అభినందించారు. రక్తదానం (BLOOD DONATION) ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని, ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని సూచించారు.14 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంస్థ ప్రతినిధులను (SERVICE ORGANIZATION) అధికారులు అభినందించారు. రక్తదాన శిబిరం (BLOOD CAMP) నిర్వహణ ద్వారా అవసరమైన వారికి రక్తం అందించడంలో సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న దాతలకు (DONORS) కృతజ్ఞతలు తెలిపారు