అంగన్‌వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం

01-10-2026 | 02:40pm

గణపురం, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా బీజేపీ చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్‌లో(Seva Sankalp Abhiyan) భాగంగా గణపురం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం-5, కొత్తపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో గురువారం అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. బీజేపీ మండల కన్వీనర్ మంద మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నె మొగిలి హాజరయ్యారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు ఆలూరి కోమల, దుర్గం సుశీలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంగన్‌వాడీ కార్యకర్తల సేవలు అభినందనీయమని జన్నె మొగిలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మాదాసు మొగిలి, సీనియర్ నాయకులు సోమ దామోదర్, బొద్దుల మొగిలి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు