ఈసారి ఆ కోరిక తీరింది!
తమిళ స్టార్ విజయ్ సేతుపతి(Tamil star Vijay Sethupathi) కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా(Thiagarajan Kumararaja) తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘పాకెట్ నావెల్(Pocket Novel)’. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan). ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన హీరోయిన్‌గా కనిపించనున్న మాళవిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్(Emotional post) పెట్టింది. ఈ సినిమాతో తనకంటూ ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని మిగిల్చుకున్నానని పేర్కొంది.
ముఖ్యంగా తన కో-స్టార్ విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. “షూటింగ్ సమయంలో నెలల తరబడి ఒకే టీమ్‌తో కలిసి పనిచేయడం, ప్రతిరోజూ కలిసి గడపడం వల్ల ఆ సెట్టే మాకు రెండో ఇల్లులా మారిపోయింది. కేవలం సినిమాలు చేయడం కంటే, ఆ సమయంలో కలిసే మనుషులే ఎంతో ముఖ్యమని నేను ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలుసుకున్నాను. విజయ్ సేతుపతితో గతంలో ‘పేట’, ‘మాస్టర్’ సినిమాల్లో నటించినప్పటికీ ఇద్దరం కలిసి నటించే సన్నివేశాలు రాలేదు. ఈసారైనా ఆ కోరిక తీరినందుకు ఆనందంగా ఉంది.
విజయ్ సేతుపతి నాకు ఎంతో సపోర్టివ్‌గా, కేరింగ్‌గా ఉన్నారు. నటనలో ఎంత సమయం పట్టినా ఎంతో ఓపికగా సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడేలా చూశారు. త్యాగరాజన్ కుమారరాజా ఒక కూల్ డైరెక్టర్ మాత్రమే కాకుండా గొప్ప వ్యక్తి. ఆయనతో పనిచేయడం జీవితంలో అరుదైన అనుభవం. ‘పాకెట్ నావెల్’ నాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, నా హృదయానికి ఎంతో దగ్గరైన అద్భుతమైన ప్రపంచం. త్వరలోనే థియేటర్లలో కలుద్దాం” అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది మాళవిక.