స్ట్రైకర్.. ఏఐ సినిమా!

25-11-2026 | 05:30am

2003లో ‘తొలి పరిచయం(First Introduction)’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కిరణ్ కర్నీడి(Kiran Karnee) 23 ఏళ్ల తర్వాత ‘స్ట్రైకర్’ అనే సినిమాతో మళ్లీ వస్తున్నారు. ఏఐతో తను రూపొందించిన ఫీచర్ ఫిల్మ్ ‘స్ట్రైకర్‘ చిత్రం వివరాలు అధికారికంగా వెల్లడించారాయన. యూనివర్సల్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మ్యాజిక్ మష్రూమ్స్; బీజీఎం: శాలిని మిశ్రా; ఎడిటర్, ఏఐ క్రియేటర్: శ్రీనాథ్ మాచర్ల. 

మరిన్ని వార్తలు