మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి
ప్రముఖ దర్శకుడు దేవా కట్టా(Director Deva Katta) సమర్పణలో రూపొందుతున్న ‘జో జో’ సినిమా(JoJo movie) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం నుంచి రెండో టీజర్ విడుదలైంది. వినూత్న ప్రచార శైలితో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న చిత్ర బృందం.. తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.
‘మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి’
సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఉపయోగిస్తున్న ఈ ప్రత్యేకమైన హెచ్చరిక ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ ప్రచారానికి భిన్నంగా, కొంత వ్యంగ్య ధోరణిలో సాగుతున్న ఈ క్యాంపెయిన్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే విభిన్నమైన ప్రచారంతో చర్చకు తెరలేపిన ‘జో జో’.. రెండో టీజర్(JoJo movie teaser 2)తో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కథాంశం, పాత్రలు, వినోదం ఏ స్థాయిలో ఉండబోతున్నాయనే విషయాలపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. వినూత్న ప్రమోషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్న ‘జో జో’ టీమ్.. రాబోయే రోజుల్లో ఎలాంటి అప్‌డేట్స్‌తో ముందుకొస్తుందో చూడాలి.