నామినేషన్స్.. హీటెక్కిన హౌస్
బిగ్‌బాస్ తెలుగు 10లో ఐదో వారం నామినేషన్స్ (Nominations) తొలిరోజే హౌస్‌ను హీటెక్కించాయి. గుమ్మడికాయ టాస్క్ (Task)తో మొదలైన నామినేషన్లలో కంటెస్టెంట్లు (Contestants) ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. రాంప్రసాద్ గెలిచి అమన్, త్రిగుణ్‌ను నామినేట్ (Nominate) చేయగా.. ముకేశ్ అపూర్వను టార్గెట్ (Target) చేశాడు.
ఇవి కూడా చదవండి: శ్రీవిష్ణు మార్క్ కామెడీ పక్కా..
అనంతరం గుమ్మడికాయ దక్కించుకున్న త్రిగుణ్.. అపూర్వ, అమన్‌లను నామినేషన్‌లోకి నెట్టాడు. అమన్ మాత్రం ముకేశ్‌ను నామినేట్ చేశాడు. ఇక వర్షిణి.. అపూర్వ, రోహిత్‌లను నామినేట్ చేసింది. షాలిని త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో త్రిగుణ్-రోహిత్, అపూర్వ-ముకేశ్ మధ్య మాటల యుద్ధం (War of Words) నడిచింది. మొత్తంగా నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగాయి. మిగిలిన నామినేషన్ ప్రక్రియ (Process) నేడు కొనసాగనుంది.