ఎస్సీ బాలికల వసతి గృహంలో హెల్త్ క్యాంప్

06-10-2026 | 12:02pm

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Banswada) పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం(SC Girls Hostel)లో విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మంగళ వారం వసతి గుహ వార్డెన్ గంగా సుధా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు(Health check-ups) నిర్వహించి, అవసరమైన సూచనలు చేశారు.విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.వసతి గృహాల్లో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు