పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు
భేదాభిప్రాయాలు విడనాడండి
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
మానకొండూరు,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, భేదాభిప్రాయాలు విడనాడి, పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Dr. Kavvampalli Satyanarayana) పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం మండల కేంద్రమైన మానకొండూరులో మండల పరిధిలోని గ్రామాల, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల(party village branch presidents)కు నియామక ఉత్తర్వులు అందించి ఆయన మాట్లాడారు.
పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తిస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అంతర్గత విభేదాలను విడనాడాలని సూచించారు. పదవీకాలం పూర్తయిన గ్రామ శాఖ అధ్యక్షుల(Village branch presidents)ను శాలువాతో సత్కరించి, వారి సేవలను కొనియాడారు. పదవులు అలంకరణ కాకూడదని, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసేవారిని విస్మరించబోమని చెప్పారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని నూతన గ్రామ శాఖ అధ్యక్షులకు సూచించారు.
కార్యక్రమంలో మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్‌గౌడ్, ప్యాక్స్ అధ్యక్షులు నాగిశెట్టి రాజయ్య, ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, రొంటాల లక్ష్మారెడ్డి, గంగుల రామిరెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెంచాల కిషన్‌రావు, పార్టీ నాయకులు మర్రి ఓదెలు యాదవ్, రామిడి తిరుమల్‌రెడ్డి, రేమిడి శ్రీనివాస్‌రెడ్డి, మీస సత్యనారాయణ, ఎడ్ల సత్యనారాయణ, బుర్ర శ్రీధర్‌గౌడ్, బోళ్ల మురళీధర్, గొల్లెన కొమురయ్య, మ్యాడ తిరుపతిరెడ్డి, తోట శ్రీనివాస్, బొట్ల కిషన్, కిశోర్, కనకం సంపత్, దూలం దేవేంద్ర, కొత్తకొండ శంకర్, బుర్ర శ్రీకాంత్, కనకం అశోక్, కోండ్ర సురేష్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.