శాంతి వనం పార్కులో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు
మేడిపల్లి, అక్టోబర్ 02 (విజయక్రాంతి): వాకర్స్‌లో అవగాహన కల్పించేందుకు శాంతివనం పార్కులో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ప్రకృతిని, వన్యప్రాణులను రక్షించాలనే జాతీయ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ(Telangana Forest Department)(ఉప్పల్ రేంజ్) 72వ వన్యప్రాణి వారోత్సవాలను అధికారికంగా శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రతిరోజూ పార్కుకు వచ్చే మార్నింగ్ వాకర్స్, స్థానిక ప్రజలు, పిల్లలకు పర్యావరణం పైఅవగాహన కల్పించారు. పట్టణాల్లోని పార్కులు స్థానిక జీవవైవిధ్యానికి ఎంతో కీలకమైనవి అని, పట్టణ వన్యప్రాణుల సంరక్షణలో పౌరుల పాత్రను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ శరత్ చంద్రారెడ్డి, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.