అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జిల్లా జాయింట్ సెక్రటరీగా గుండ్రోజు కృష్ణచారి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ(All India Vishwakarma Mahasabha) మేడ్చల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా ఘట్ కేసర్ పట్టణానికి చెందిన గుండ్రోజు కృష్ణచారి నియమితులయ్యారు. విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి, రాష్ట్ర సలహాదారులు తల్లోజు చెన్నయ్యచారి, అధ్వర్యంలో తరణి మహేంద్రచారి సమక్షంలో గుండ్రోజు కృష్ణచారిని మేడ్చల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి మాట్లాడుతూ... విశ్వబ్రాహ్మణ సమాజం కోసం సేవ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న యువతను, సీనియర్ నాయకులకు, మేధావులకు సంఘం బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులను గురించి, వారి సేవలు సామర్థ్యాలకు అనుగుణంగా, భవిష్యత్తులో సముచిత స్థానం, బాధ్యత్తలు కల్పిస్తామని తెలిపారు. జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమితులైన కృష్ణచారి కి పలువురు సంఘ నాయకులు, విశ్వకర్మ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.






