సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
జవహర్ నగర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(Communist Party of India) కాప్రా మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి నేతృత్వంలో బాలాజీ నగర్లోని బాపూజీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహనీయుడు గాంధీజీ అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శాఖ కార్యదర్శి కొండా సత్యం సాగర్, డిహెచ్పిఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మల్లేశం, ఏఐటియుసి మండల అధ్యక్షులు అంబల ఎల్లయ్య, శాఖ సహాయ కార్యదర్శి నాని, కె. రుక్మియా, ఎరుకల సోమేష్ తదితరులు పాల్గొన్నారు.