అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు!!
శివంపేట అక్టోబర్ 2 (విజయక్రాంతి): శివంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్(Sarpanch Venkateshwar), ఉపసర్పంచ్ ఇసుగారి మల్లేశం గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి పరిశీలించారు, ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలు, వారికి అందిస్తున్న ఆహారం, కేంద్రంలోని పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.
చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు నాణ్యమైన గుడ్లను అందించాలని సర్పంచ్, ఉపసర్పంచ్ సూచించారు, చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలని తెలిపారు, అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అంగన్వాడీ టీచర్‌కు సూచించారు, చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అదేవిధంగా గ్రామంలోని వివిధ దుకాణాల్లో కాలం చెల్లిన వస్తువులను చిన్నారులకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వస్తువులను విక్రయించకుండా సంబంధిత దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యానికి హాని కలిగించే కాలం చెల్లిన ఆహార పదార్థాల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు, దుకాణాల్లో విక్రయించే ఆహార పదార్థాల గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో ఆహార పదార్థాల నాణ్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం కృషి చేస్తుందని తెలిపారు, గ్రామంలోని చిన్నారుల ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం విషయంలో గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు, ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం సిబ్బంది, చిన్నారులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు, కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చిన్నారులకు ఆహారం అందించే సమయంలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు, కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శి రమాదేవి, అంగన్వాడీ టీచర్, గ్రామస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.