ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పరిశీలన

10-10-2026 | 07:17pm

ముకరంపుర, అక్టోబర్ 10(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు(Telangana cultural traditions), విశిష్టతకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమవుతాయి. ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో(Devotional), ఉత్సాహంగా జరుపుకునే ఈ మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మను పేరుస్తారు. 

ఈ సందర్భంగా వేడుకలు జరుపుకోవడానికి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Yadagiri Sunil Rao) సంబంధిత అధికారులు మరియు కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.వేడుకలు జరిగే ప్రదేశంలో, ఘాట్ల వద్ద పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, భద్రతా చర్యలు పక్కాగా ఉండాలని ఆయన సూచించారు. బతుకమ్మ వేడుకలకు విచ్చేసే ప్రతి మహిళా సోదరి  ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకునేలా ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు