బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక!

19-10-2026 | 06:54pm

- ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణ ప్రజల జీవన విధానంలో అంతర్భాగమని పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ(Saddula Bathukamma celebrations)ను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్ గ్రామ శివారులో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, ఆడపడుచులతో కలిసి బతుకమ్మ సంబరాలను తిలకించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు