బిల్లులు, జీతాల కోసం కలెక్టరేట్ ఎదుట ఆందోళన

12-10-2026 | 11:18pm

- బతుకమ్మ ఆడి నిరసన చేపట్టిన మధ్యాహ్నం భోజన కార్మికులు 

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): పెండింగ్ బిల్లులు, జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (Telangana Mid-Day Meal Workers' Union) ఆధ్వర్యంలో సోమ వారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ హామీలను అమలు చేయాలని బతుకమ్మ ఆడుతూ నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్(CITU District Secretary Dumpala Ranjith Kumar) మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ప్రతి నెల రావలసిన జీతాలు బిల్లులు సకాలంలో రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దసరా పండగ సందర్భంగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు.

అనంతరం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు(Additional Collector Ramulu)కి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం(సీఐటీయు)జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాగం రాజారాం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి కరీమా, ఎండి రఫియా, కోశాధికారి సవిత, ఉపాధ్యక్షులు మధునమ్మ, రబియా, సహాయ కార్యదర్శులు రమాదేవి, సరిత, జ్యోతి, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు