"స్వేచ్ఛా రథం" వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్

12-10-2026 | 11:26pm

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): వెట్టి చాకిరీ నిర్మూలనపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన "స్వేచ్ఛా రథం" వాహనాన్ని(Swechha Ratham Vehicle) జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి క్రాంతి కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి(District Welfare Officer) రౌఫ్ ఖాన్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకిరీ, బలవంతపు శ్రమ వంటి దురాచారాలను నిర్మూలించి కార్మికులకు న్యాయం జరిగేలా స్వేచ్ఛ రథం ద్వారా అవగాహన కల్పించడంతో పాటు బాధితులకు సహాయ సేవలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే బాండెడ్ లేబర్ హెల్ప్ లైన్ నెంబర్ 080-6943434 పై అందరికీ తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, భూగర్భ గనులు, క్వారీయింగ్, వ్యవసాయ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు అవగాహన కల్పించి వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనకు సమన్వయంతో పని చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు