మహాచండీ యాగం
19-10-2026 | 07:01pm
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ భగత్ సింగ్ నగర్ లోని శ్రీ సాయి దుర్గమాత ఆలయం(Sri Sai Durgamata Temple)లో సోమ వారం మహా చండీ యాగం(Maha Chandi Yagam) నిర్వహించారు. రంజిత్ శర్మ బృందం చండీయాగాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఏడవ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల రవీందర్ మమత, మండలి అధ్యక్షుడు సందినేని మల్లయ్య, కొండ శ్రీనివాస్, రాఘవులు, లక్ష్మయ్య, చుంచు రమేష్, మచ్చ బాపు, గోపాల్, రవి, శ్రీనివాస్, కుమార స్వామి, అంజయ్య, సత్యనారాయణ, నోమయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు.