విద్యుత్ షాక్‌తో బాలుడికి గాయాలు
విద్యుత్ వైర్ల ప్రమాదంపై పలుమార్లు విద్యుత్ శాఖ ఎఈ
లైన్మెన్ లకు చెప్పినా పట్టించుకోలేదని తల్లిదండ్రుల ఆరోపణలు
గండీడ్, అక్టోబర్ 10: విజయక్రాంతి: మండల పరిధిలోని వెన్నచెడ్ గ్రామంలో(Vennached Village) విద్యుత్ షాక్‌కు(Electric shock) గురై ఓ బాలుడు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కవలి వెంకటయ్య కుమారుడు శ్రీశైలం(Srisailam) ఇంటిపై ఆడుకుంటుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనలో బాలుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
ఇంటి పైభాగంలో ఉన్న విద్యుత్ వైర్ల వల్ల ప్రమాదం పొంచి ఉందని, ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత సిబ్బందికి తెలియజేసినా స్పందించలేదని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే సమస్యను పరిష్కరించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని వారు పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య, కోస్గిలోని ఆసుపత్రికి వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేసి, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని.సర్పంచి తోపాటు గ్రామస్తులు కోరుతున్నారు.