బోరుకు మరమ్మతులు.. నీటి సమస్య కు చెక్
ప్రజల సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ దీప్తిరఘురాం గౌడ్
హన్వాడ : మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలోని రెండో వార్డులో బోరు పనిచేయకపోవడంతో స్థానికులు సర్పంచ్ గుముడాల దీప్తిరఘురాం గౌడ్(Sarpanch Gumudala Deepthi Raghuram Goud) దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సర్పంచ్ బోరుకు మరమ్మతులు చేయించి నీటి సరఫరా పునరుద్ధరణకు(Restoration of water supply) చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో నీటి ఎద్దడి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య గౌడ్, రాములు గౌడ్, మధు గౌడ్, కర్ణాకర్ గౌడ్ కార్మికులు పాల్గొన్నారు.