ఆపదలో ఆపన్నహస్తం.. మిత్రుడి కుటుంబానికి రూ.50వేల సాయం

20-09-2026 | 07:30pm

మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్, సెప్టెంబరు 20, విజయక్రాంతి : మండల పరిధిలోని సల్కర్‌పేట్(Salkarpet) గ్రామానికి చెందిన కావలి శ్రీను(43) అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న మహబూబ్‌నగర్ జిల్లా ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ (MVS Degree College) 2006 బ్యాచ్కు చెందిన తోటి మిత్రులు మానవతా దృక్పథంతో శ్రీను కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. మృతుడు శ్రీను భార్య కావలి పుష్ప, కుమార్తె సాత్విక, కుమారుడు గౌతమ్‌లకు రూ.50 వేల చెక్కును ఆర్థిక సాయం అందజేశారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన బ్యాచ్ మిత్రులకు శ్రీను కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు జైపాల్ రెడ్డి, బాలకృష్ణ, కృష్ణ,పోలీస్ కృష్ణ, పిట్ల హన్మయ్య, మల్లేష్, సాయన్న, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు