పద్మశాలి కార్పొరేటర్లకు సన్మానం
కరీంనగర్ సిటి సెప్టెంబర్13 (విజయక్రాంతి): అఖిలభారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం(Padmashali Association) సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడ లోని పద్మశాలి భవన్లో ఇటీవల ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన మేయర్, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు రాష్ట్రస్థాయిలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పద్మశాలి కార్పొరేటర్ లు వాసాల రమేష్, మాసం గణేష్, వేముల కవితా చంద్రశేఖర్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, చొప్పరి జయశ్రీ వేణు, తెల్ల లక్ష్మి రమేష్ లను పద్మశాలి సంఘం కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు తోపాటు రాష్ట్ర, జాతీయ నాయకులు ప్రశంస పత్రంతో పాటు మెమొంటో శాలువాతో ఘనంగా సత్కరించారు. పద్మశాలి సమాజానికి, ప్రజలకు మరింత సేవ చేయాలని వారు కార్పొరేటర్లను కోరారు. రాజకీయంగా మరింత రాణించాలన వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం, కార్యదర్శి వోల్లాల కృష్ణహరి, అలుస భద్రయ్య తదితరులు ఉన్నారు.