అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ ఆస్పత్రిలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం
సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం పిలుపు
ములుగు, సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి): ప్రజలకు అత్యంత ఆధునిక మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్(Apollo Reach NSR) ఆసుపత్రి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని యాజమాన్యం తెలిపారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు. అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో 5 రోజుల ఉచిత ఈ ఎన్ టి సర్జరీ మెగా ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్, వరంగల్ ఆధ్వర్యంలో ప్రముఖ ఈ ఎన్ టి సర్జన్ డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ సేవలతో 15 సెప్టెంబర్ నుండి 19 సెప్టెంబర్ వరకు ప్రత్యేక ఈ ఎన్ టి సర్జరీ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో చెవిలో నొప్పి, వినికిడి తగ్గడం, తరచుగా జలుబు, ముక్కు బ్లాక్ అవ్వడం, గొంతు నొప్పి, మింగేటప్పుడు ఇబ్బంది అవడం, తలనొప్పి, సైనసైటిస్, చెవిలో మోగుడు శబ్దం, ముక్కు నుంచి రక్తస్రావం వంటి సమస్యలకు చికిత్స అందిస్తామని వివరించారు.
ఆరోగ్య శిబిరంలో భాగంగా ఉచిత ఓపి, ఎండోస్కోపి పరీక్ష, వినికిడి పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, రక్త పరీక్షల పైన 50 శాతం రాయితీ ఇస్తారని తెలిపారు. ఈ శిబిరం 15 సెప్టెంబర్ నుండి19 సెప్టెంబర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్, కొత్తపేట క్రాస్ రోడ్, ఆరెపల్లి, వరంగల్ లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజలందరూ ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరారు మరిన్ని వివరాలకు 94598 75555 సంప్రదించాలని వివరించారు.