పోలీసుల కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

03-11-2026 | 11:55pm

బెల్లంపల్లి: బెల్లంపల్లి టౌన్-II పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే రాడగంబాల బస్తీలో మంగళవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీ(కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్) నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్(ACP Kiran Kumar) మాట్లాడారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలపై జరిగే నేరాలు  వ్యక్తులపై జరిగే నేరాల గురించి అవగాహన కల్పించారు.

అలాగే యువత విద్యార్థులకు వారి భవిష్యత్తును మెరుగుపరుచుకునేలా విలువైన సూచనలు అందించారు. అంతేకాకుండా, సరైన పత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలు, 2 ఆటో-రిక్షాలను స్వాధీనం చేసుకున్నారు. కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ సిహెచ్ తిరుపతి, బెల్లంపల్లి రూరల్ సీఐ అనూక్, బెల్లంపల్లి టౌన్-I ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, వన్ టౌన్, తల్లగురిజాల పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు