అక్రమంగా మత్తు పదార్థాన్ని కలిగి ఉన్న నలుగురు నిందితులు రిమాండ్
ఘట్ కేసర్, నవంబర్ 3 (విజయక్రాంతి): అక్రమంగా మత్తు పదార్థాన్ని కలిగి ఉన్న నలుగురు నిందితులను పోచారం ఐటీ కారిడార్ పోలీసులు(Pocharam IT Corridor Police) అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారం ఐటీసీ పోలీసులు, ఎస్‌వోటీ సిబ్బంది కలిసి అక్రమంగా(ఎమ్‌డీఎమ్‌ఏ) మత్తు పదార్థాన్ని కలిగి ఉన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
మంగళవారం మధ్యాహ్నం అన్నోజిగూడ వద్ద జాతీయ రహదారిపై పోచారం పోలీసులు నిందితుల కారును తనిఖీ చేసి స్వంత వాడకంతో పాటు విక్రయించేందుకు గోవా నుండి హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు (ఎమ్‌డీఎమ్‌ఏ) డ్రగ్ (పౌడర్)ను రవాణా చేస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.
పోలీసులు వారి వద్ద నుండి 32 మిల్లీగ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ పౌడర్, 4 మొబైల్ ఫోన్లు, రవాణాకు ఉపయోగించిన మెరూన్ రంగు ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత, నిందితులైన ఉప్పల్ వినాయక్ నగర్ కు చెందిన కొమ్ము ప్రశాంత్ (28), ఉప్పల్ చిల్కానగర్ కు చెందిన భూర్క ప్రవీణ్ కుమార్(27), ఉప్పల్ భరత్ నగర్ కు చెందిన గడ్డల తరుణ్ (26), పెద్దోళ్ల ప్రవీణ్ (25) లపై కేసు నమోదు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.