పూల పండుగకు ఓయూ ముస్తాబు
11-10-2026 | 11:48am
హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ (Bathukamma Festival) సందడి ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) నెలకొననుంది. ఓయూ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆర్ట్స్ కాలేజీ వద్ద బతుకమ్మ సంబరాలు (Bathukamma Celebrations) నిర్వహించనున్నారు.
విద్యార్థుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా (Chief Guest) హాజరుకానున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు (Worship of Nature) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.