మురసు తుపాను ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన!
మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (Extremely Heavy Rainfall) కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
సూర్యాపేట, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.